యాదాద్రి దేవాలయ ట్రస్టు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్ వేధింపులు, దాడిని తట్టుకోలేక గిరిజన యువకుడు రాజేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ తన మనవడి రాజకీయ జీవితాన్ని నాశనం చేయొద్దని, కేసు బయటకు రాకుండా బాధిత కుటుంబానికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు. అంత్యక్రియల సమయంలో తన కొడుకు చావుకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసుల కాళ్లపై పడ్డారు. కానీ కనికరించని ఖాకీలు రాజేష్ కుటుంబ సభ్యులపైనే దాడి చేశారు.