కాంగ్రెస్ నేతలు కెసిఆర్ ఫాంహౌస్ భూముల సందర్శనకు వెళ్లడంపై మంత్రి బండి సంజయ్ ఖండించారు. “ఫాంహౌస్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా?.. అధికార పార్టీ నేతలు అక్కడికి వెళ్లడమేంది?.. ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎవరిచ్చారు?.. పాంహౌస్లో సర్కార్ భూములుంటే తక్షణమే వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.. ఆ విషయాన్ని వదిలేసి ఈ రాజకీయ డ్రామాలేంది?” అని మండి పడ్డారు. కెసిఆర్ కుటుంబం రూ.లక్ష కోట్ల భూదోపిడీ చేసినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.