పాకిస్తాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ను లాహోర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలుకు తరలించారు. లాహోర్లోని తన నివాసం నుంచి అలీమా ఖాన్ను స్థానిక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నవారిని ముందస్తుగా సెక్షన్ 3, ఎంపీఓ (మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్) చట్టం కింద అరెస్టు చేస్తారు. అయితే, ఆమెను అరెస్టు చేయడానికి గల అసలైన కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.