తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్ష BRS పార్టీకి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, అప్పులపై తాము చూపిస్తున్న లెక్కలు తప్పని కేసీఆర్‌తో చెప్పించే ధైర్యం ఉందా అని ఆయన నిలదీశారు. ఈ అంశాలపై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌క్లబ్‌లో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చూపిన లెక్కలు తప్పని నిరూపిస్తే తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.