పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్లో మరో అద్భుత మైలురాయిని అందుకున్నాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32లో భాగంగా క్రొయేషియాతో జరిగిన కీలక మ్యాచ్లో ఆయన ఈ రికార్డు సాధించాడు. 41 సంవత్సరాల 147 రోజుల వయసులో గోల్ కొట్టిన రొనాల్డో.. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో గోల్ చేసిన అత్యంత వృద్ధ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్లు దాటిన తర్వాత నాకౌట్ స్టేజ్లో గోల్ చేసిన తొలి ప్లేయర్ కూడా ఆయనే.