ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు ఆలయ జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఆలయ దిగువ సన్నిధిలో రూ.6.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టులకు ఆయన భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ పనుల ద్వారా చారిత్రక కట్టడాలను రక్షించడంతో పాటు, భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించనున్నారు.