సాయికృష్ణ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్కు గురైన సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) నాగరాజు తన కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు సంచలన లేఖ రాశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న SITపై సీఐ నాగరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “సాయికృష్ణ కేసులో నేను పూర్తిగా నిర్దోషిని, నన్ను రాజకీయ లేదా వ్యక్తిగత కారణాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారు” అని కోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక లేఖలో స్పష్టం చేశారు. సిట్ అధికారులు తనను మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాగరాజు ఆరోపించారు.