పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్ 28 ఏళ్ల అయేషా గిలానీ(షమ్సు బీబీ) దారుణ హత్యకు గురయ్యారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో దాదాపు 1.3 మిలియన్ల(13 లక్షల) మంది ఫాలోవర్లతో ఆన్లైన్లో ఎంతో చురుగ్గా ఉండే అయేషా గిలానీ.. పట్టపగలు కారులో ప్రయాణిస్తుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఫోన్ కాల్ రాగా ఆమె తన 15 ఏళ్ల సోదరి అసిమా, సోదరుడు ఇమాతుల్లాతో కలిసి కారులో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వారి కారును అడ్డుకుని కాల్పులు జరిపారు