జనసేన పార్టీ ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్పర్సన్గా కొణిదెల నాగబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ఈ పదవికి ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. దీంతో నాగబాబుకు కీలక ప్రభుత్వ బాధ్యత దక్కినట్లయింది. రాష్ట్రంలో హరితాభివృద్ధి, అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేసింది.