జూనియర్ డాక్టర్ల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. తమ దీర్ఘకాలిక డిమాండైన స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంతో నేటి నుంచి అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. ఇప్పటివరకు రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేవలం సాధారణ వైద్య సేవలు (ఓపీడి), విధులకు మాత్రమే దూరంగా ఉన్నామని, కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని