ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో మొదలయ్యాయి. ఉదయం 10:30 తర్వాత బ్రేక్ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజులపాటు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాలు నాలుగు రోజులపాటు నిర్వహించే
అవకాశం ఉంది.