అమెరికాతో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా సైనికులను చంపినా లేదా పట్టించినా.. 30 వేల డాలర్ల (సుమారు రూ.28లక్షలు) రివార్డు ఇస్తామని ఇరాన్ సైన్యం వెల్లడించింది. ఒకవేళ ఇదే పనిని ఇరాన్ మహిళలు చేస్తే.. వారికి దీనికి రెట్టింపు నగదును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు మేరకే ఈ ప్రణాళికను రూపొందించినట్లు ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ వెల్లడించారు.