ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగురోజుల పాటు జరుగనున్న అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. జగన్ అసెంబ్లీకి వస్తే డీఎస్సీతో సహా పలు అంశాలపై
మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. అర్హత లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేనని స్పష్టం చేశారు.