బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో కేటీఆర్ తన సొంత చెల్లినే ఇంటి నుంచి బయటకు గెంటేశాడని సీఎం రేవంత్ ఆరోపించారు. ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, సొంత చెల్లికే న్యాయం చేయలేని నాయకుడు రాష్ట్రంలోని మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడని నిలదీశారు. బిఆర్ఎస్ నేతల కుటుంబ రాజకీయాలు,
వ్యక్తిగత ప్రవర్తనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, కేటీఆర్ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు.