హంగేరీలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ టూరిస్టు బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఎమ్ 3 మోటర్ వే, మేజోకెర్జ్సెట్ లో జరిగింది. టూరిస్టు బస్సు నైరేగిజాహా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు హంగేరియన్ పోలీసులు తెలిపారు. ఈ బస్సు రోడ్డు భాగాన్ని వదిలి లోయలో పడినట్లు వివరించారు.డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్న కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.