మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి వనదేవతల ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మేడారం గద్దెల వద్ద సమ్మక్క-సారలమ్మలకు సీఎం రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారం, చీరె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడ రూ.868 కోట్ల విలువైన పంచాయతీరాజ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల పంపిణీలో బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.