పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఐతంపూడి లాకుల వద్ద వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి నేరుగా ప్రధాన కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు వ్యక్తులు గల్లంతవగా.. మరొకరు సురక్షితంగా బయటపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కారు క్షణాల్లోనే నీట మునిగిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.