జాతీయ గేయం వందేమాతరంను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు.ఈ గేయాన్ని రచించిన బంకిం చంద్ర చటోపాధ్యాయతోపాటు దేశ ప్రజలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. “సోనియా జీ, 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ‘వందేమాతరం’ గేయాన్ని అసంపూర్ణంగా వదిలేయాలని ఎవరైనా ఎలా ఆలోచించగలరు? కాంగ్రెస్ పార్టీ దీనికి సిగ్గుపడాలి” అని అన్నారు.