కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన రెండు వర్గాలకు చెందిన భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో ఇరు వర్గాలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది దాకా గాయపడ్డట్టు తెలుస్తోంది