ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో దిమాగీ నక్సల్స్ అనే పదం వాడారు. దీని అర్దం మేథావులైన నక్సల్స్. ఇప్పుడు దిమాగీ నక్సల్స్ సమస్యగా మారిందంటూ బీజేపీని, కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న మేథావుల్ని, విద్యార్దుల్ని, విపక్షాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ, దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పేరుతో కొత్త కౌత్త అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఎక్స్, ఇన్ స్టాతో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఇవి ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. వీటికి భారీ సంఖ్యలో ఫాలోయర్లు కూడా వచ్చేస్తున్నారు.