సాధారణంగా టీనేజ్‌లో ఉండే యువత భవిష్యత్ కెరీర్ గురించి ఆలోచిస్తున్న వయసులోనే, లక్ష్మణన్ మేయప్పన్ దుబాయ్‌లో స్థిరపడి అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 16 ఏళ్ల 141 రోజుల వయసులోనే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటింగ్ (ACCA) అర్హతను పూర్తి చేశాడు. దీని ద్వారా ‘ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పురుష చార్టర్డ్ అకౌంటెంట్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకుని భారత్ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు.