అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17న ప్రారంభమైన సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ 2025పై వివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను రికార్డు స్థాయిలో 148 రోజుల్లో పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 3.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రభుత్వం బాధ్యతాయుత వైఖరికి నిదర్శనమని లోకేష్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.