తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు హోటల్ ప్యారడైజ్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానాను జలమండలి విధించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్ ప్యారడైజ్లో (క్యాన్ నంబర్: 612182839) నీటి దుర్వినియోగాన్ని గుర్తించారు. దీంతో రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు భవిష్యత్తులో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని యాజమాన్యానికి సూచించారు. నీటి దుర్వినియోగానికి పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు.