హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రే వినయ్ రంజన్ భార్య తనూజా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిచేసే వారిని ఉపయోగించుకుని దోపిడీలకు పాల్పడుతున్న నేపాల్‌కు చెందిన అంతర్జాతీయ ముఠాపై ప్రత్యేక దర్యాప్తు బృందం, ఈ కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను అక్టోబర్ 26న నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. ఈ ముఠా బెంగళూరు, ఢిల్లీలలోనూ ఇలాంటి నేరాలకు ప్రణాళికలు రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు.