తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, ముంపు సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాలు అంగీకరించినట్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించిన ఫడణవీస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.