మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఆఫ్-స్టైల్, లో-గ్రేడ్ పొగాకు రకాలకు క్వింటాలుకు అదనంగా రూ. 1,000 (కిలోకు రూ. 10 చొప్పున) ప్రోత్సాహకంగా అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
వ్యాపారులు రైతుల వద్ద నుంచి పొగాకును కొనుగోలు చేసిన 9 రోజుల్లోనే ఈ అదనపు మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.