న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన కీలక సమావేశం దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా సాగింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక బంధాన్ని మరింత బలపరచడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని నరేంద్ర మోదీని 24వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రష్యాకు రావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ కూడా అంగీకరించారు.