రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు రెండు డీఏలు విడుదల చేస్తూ ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబర్ జీతానికి కలిపి చెల్లించాలని పేర్కొంది. 1.82 శాతం డీఏను 2025 జనవరి 1 నుంచి చెల్లించనుంది. 20 నెలల బకాయిలు 2028 జనవరి, మార్చి, మే, జులైలో ఇవ్వనుంది. 2.73 శాతం డీఏను 2024 జులై 1 నుంచి చెల్లించనుంది. 26 నెలల బకాయిలు 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబరులో జమ చేయనుంది.