గిరిజన బాలల కోసం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 25 అంగన్వాడీ కేంద్రాలను పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ నిధులు కాకుండా, కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరిపి.. సీఎస్ఆర్ పథకం కింద రూ.కోటి సమీకరించారు. వీటితో అంగన్వాడీ కేంద్రాలను అత్యాధునిక కేంద్రాలుగా చేపట్టాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు.