కేరళలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న పవన్ పూర్తిగా కోలుకున్నారు. తిరిగి స్వరాష్ట్రానికి రానున్నారు. ఈ సమయంలోనే కేరళలో ప్రఖ్యాత ఆలయాలను వరుసగా సందర్శిస్తున్నారు. కాగా, త్రిప్రయార్ శ్రీ రామస్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు.ఈ రోజు ఉదయం త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్ర సేవగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన పాల్గొన్నారు.