మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రస్తుతం ‘రెడ్‌బుక్’ అరాచకం నడుస్తోందని, లోకేశ్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేజీహెచ్ వద్ద న్యాయం అడిగిన కార్మిక సంఘాలను లోకేశ్ తీవ్రంగా అవమానించారని, వారిని బెదిరించే ధోరణిలో మాట్లాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.