కొందరిని తాను పరాన్నజీవులుగా లేదా బొద్దింకలుగా పోల్చిన వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించారు. ఒక కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లు, బోగస్ డిగ్రీలతో మీడియాలోకి, న్యాయవ్యవస్థలోకి, ఇతర వృత్తుల్లోకి ప్రవేశించేవారిని ఉద్దేశిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు. అలాంటి వారే మీడియా, సోషల్ మీడియా
తోపాటు ఇతర రంగాల్లోకి చొరబడ్డారని అన్నానని చెప్పారు. అలాంటి వారినే తాను పరాన్నజీవులుగా పేర్కొన్నట్లు తెలిపారు.