పూణేలోని మోడరన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో బోటనీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మనీషా మంధారేను సీబీఐ “NEET-UG 2026 జీవశాస్త్ర ప్రశ్నల లీకేజీకి మూలం, మరో మాస్టర్‌మైండ్” గా గుర్తించింది. పీవీ కులకర్ణి, ఇతర నిందితుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా.. మంధారేను సీబీఐ ప్రధాన కార్యాలయం విచారణ అనంతరం అరెస్టు చేశారు. విద్యా సంస్థ వర్గాల ప్రకారం.. మంధారే గత ఐదారేళ్లుగా NTA తరపున NEET ప్రశ్నపత్రాల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు.

