పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్ లొంగిపోయారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ‘‘ఈరోజు నేను నా కుమారుడు బండీ భగీరథ్‌ను విచారణ నిమిత్తం ఒక న్యాయవాది ద్వారా పోలీసులకు అప్పగించాను… కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. పోలీసులు మాత్రం బండి భగరథ్‌ను తాము అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బండి భగీరథ్ లొంగిపోలేదని కూడా సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు.