తన కుమారుడు అంశంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తామంతా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని, భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతోనే ఈరోజు అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించానని తెలిపారు. చట్టం ముందు సామాన్యులైనా, తన బిడ్డైనా అంతా సమానమే అని ఆయన తేల్చి చెప్పారు. తన బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని బండి సంజయ్ వెల్లడించారు. న్యాయపరమైన సలహాలు తీసుకోవడం వల్లే విచారణకు హాజరుకావడంలో కొంత జాప్యం జరిగిందని బండి సంజయ్ వివరణ ఇచ్చారు.