ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలు పాటిద్దామన్నారు. కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదు.. ఇతర మార్గాలూ చూడాలన్నారు. ‘‘ప్రజలు.. బంగారం కొనుగోళ్లు తగ్గించాలి. ఎలక్ట్రిక్ వాహనాలను ముందు మనమే ప్రోత్సహిద్దాం. సౌరశక్తిని పెద్దఎత్తున అందిపుచ్చుకోవాలి. దేశం మనకెంతో ఇచ్చింది.. దానికి కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చింది’’ అని చంద్రబాబు అన్నారు

