మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా పన్వెల్ నంద్‌గావ్ అంగన్‌వాడీ కేంద్రంలో దారుణం జరిగింది. ఒక అంగన్‌వాడీ కార్యకర్త చిన్నారిని ఛాతీపై బలంగా తన్నింది. ఈ ఘటనలో ఆ చిన్నారి కాంక్రీటు మెట్లపై పడిపోయింది. ఈ దృశ్యం వీడియోలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిస్సహాయురాలైన చిన్నారిని ఇలా క్రూరంగా కొట్టడంపై అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చిన్నారిని తన్నిన మహిళపై చట్టపరంగా కఠినమైన శిక్షలు పడాలని ప్రజలు డిమాండ్.