ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల వ్యానును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు.
తీవ్రంగా దెబ్బతిన్న వ్యానులో చిక్కుకున్న వారిని బయటకు తీసి రామ్‌గఢ్ సదర్ ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో ఏడుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మృతులంతా బ్యాండ్, తాషా బృందానికి చెందిన కళాకారులేనని పోలీసులు తెలిపారు.