భారత క్రికెట్ చరిత్రలో జూన్ 26, 2026 ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్నాడు. కేవలం 15 ఏళ్ల 91 రోజుల వయసులోనే భారత క్యాప్‌ను అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కుతాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్తాన్‌పై తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. గత 36 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న సచిన్ రికార్డును వైభవ్ నేడు అధిగమించబోతున్నాడు.