లండన్ లో కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి (25) MS చదవడానికి 14 నెలల క్రితం లండన్ వెళ్లాడు. భారత కాలమాన ప్రకారం మొన్న రాత్రి ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం వెళ్లి ఫ్రెండ్ రూంలో నిద్రించాడు. తరువాతి రోజు ఉదయం (నిన్న) చూసేసరికి శ్రీనాథ్ రెడ్డి విగతజీవిగా పడి ఉన్నాడు. శ్రీనాథ్ రెడ్డి లీసెస్టర్ స్క్వేర్ పట్టణంలో యూనివర్సిటీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.