బంకిం చంద్ర ఛటోపాధ్యాయ
బంకించంద్ర ఛటర్జీ (26 జూన్, 1838 – 8 ఏప్రిల్, 1894) (బంకించంద్ర ఛటోపాధ్యాయ; ‘ఛటోపాధ్యాయ్’ ని బ్రిటిష్ వారు పలకలేక ‘ఛటర్జీ’ అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా ‘ఛటర్జీ’ అని పిలవడం ప్రారంభించింది. బెంగాలీ కవి, వ్యాసరచయిత, సంపాదకుడు. బంకించంద్ర రచన వందేమాతరం మంచి పేరు తెచ్చి పెట్టింది. బంకించంద్ర వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది.

