అనంతపురం నగరంలో ఒక్కసారిగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. YSRCP కి చెందిన కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, వై. విశ్వేశ్వరరెడ్డిలను పోలీసులు అడ్డుకోవడంతో కోర్టు రోడ్డు రణరంగంగా మారింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైసీపి శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు రోడ్డుపైనే బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన ప్రాంతమైన తాడిపత్రికి బయల్దేరేందుకు మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలు తమ అనుచరులు, వైసీపి కార్యకర్తలతో కలిసి సిద్ధమయ్యారు.