అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ విగ్రహం ఎదుట సామూహిక దీక్షకు వైసిపి పిలుపు నివ్వడంతో అడ్డుకుంటామని టిడిపి కార్యకర్తలు సవాల్ విసిరారు. ప్రజా శాంతి, భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉండడంతో టిడిపి, వైసిపి పోటాపోటీగా తలపెట్టిన కార్యక్రమానికి పోలీస్ అనుమతి నిరాకరించారు. . మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో గృహ నిర్భందం చేశారు.వైసిపి పార్టీ ఆఫీసుకు వైసిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, కార్యకర్తలు, నేతలు,భారీగా చేరుకున్నారు.