పోక్సో కేసు నిందితుడు భగీరథ్ మే 16 నుంచి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. భగీరథ్ తనకు బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని, తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. జూన్ 20న మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గురువారంతో ముగిసింది. దీంతో పోలీసులు భగీరథ్ ను అదుపులోకి తీసుకొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం భగీరధ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.