సీఎం రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. SIR విషయంలో అనేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో అక్రమాలు జరిగే అవకాశం ఉందంటున్నారని.. అసలు సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నదే రాష్ట్ర అధికారులు కదా.. అని అన్నారు. అంటే, సొంత అధికారులపైనే ముఖ్యమంత్రికి నమ్మకం లేకుండా పోయిందన్నారు. మజ్లిస్ పార్టీతో కుమ్మక్కై ఒకవేళ ఓటర్ లిస్టులో నుంచి పేర్లు తొలగిస్తే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాలని పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. తన అధికారులనే ఇళ్లల్లోకి రానివ్వద్దని కూడా చెబుతున్నారని విమర్శించారు.