శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల సేవలు బుధవారం నుంచి అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉచిత EV బస్సులను ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ సంస్థ 25 ఎలక్ట్రిక్ బస్సులను, బయోటెక్ సంస్థ అదనంగా 7 బస్సులను TTD ఉచితంగా అందజేశాయి. Jio-BP సహకారంతో తిరుమలలో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయడం విశేషం.