మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై సమగ్ర విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో ఉందనే ఆరోపణలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సభలో స్పష్టం చేశారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సరిహద్దులు, ఆక్రమణలపై 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.