ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా టిక్టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ నిలిచారు. గౌతమ్ అదానీని అధిగమించి ఆయన తొలిసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 43 ఏళ్ల వయసున్న జాంగ్ యిమింగ్ సంపద విలువ 105 బిలియన్ డాలర్లకు పైనే ఉంది. 2019లో పోలిస్తే.. ఆయన సంపద విలువ ఎనిమిది రెట్ల కంటే ఎక్కువే పెరిగింది. ఆసియాలో సంపన్నుల్లో రెండు, మూడో స్థానాల్లో భారత్ కు చెందిన గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ ఉన్నారు. నాలుగో స్థానంలో యునిక్లో ఫౌండర్ తడసి యనయ్ (జపాన్) నిలిచారు.