జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదం నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన శరణ్య తాజాగా ఒక ఆడియో మెసేజ్‌ను విడుదల చేశారు. “నేను ఈ పోరాటంలో పూర్తిగా మోసపోయాను.. ఈశ్వర్ లేకపోతే నేను బతకలేను.. నా జీవితాన్ని పూర్తిగా ఆగమాగం చేశారు, అందుకే నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తోంది. ఈ ద్రోహాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పరిణామాల మధ్య తీవ్ర మనోవేదనతో శరణ్య బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం.