డీఎస్సీలో మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తి SCERTలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని జగన్ ఆరోపించారు. అతడు పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నాడని.. ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయం బయటకు పొక్కేసరికి, ఆ వివరాలను డేటాబేస్ నుంచి డిలీట్ చేశారని.. మెరిట్ లిస్టులను దాచారని మండిపడ్డారు. అసలు సెలెక్ట్ అయినవారి వివరాలు ఎందుకు బయటపెట్టలేదని, అభ్యర్థులకు నేరుగా మెసేజ్లు పంపుతున్నారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఎంపికైనవారి జాబితాను కలెక్టర్ కార్యాలయాల్లో కూడా పెట్టలేదన్నారు.